కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో జరిగింది. ఆదివారం (మే 4) ఉదయం సెంట్రల్ పెట్రోలియం, నాచురల్ గ్యాస్ మినిస్టర్ రామేశ్వర్ తెలి.. మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు.. ప్రశాంత్, తెరస్ గొవల్లాతో కలిసి ఇండిగో ఫ్లైట్ ఎక్కారు. దిబ్రూగఢ్ లో దిగాల్సి ఉంది. అయితే, విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గువహటి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
ఈ విషయంపై మీడియాతో టెలిఫోన్ లో మాట్లాడిన రామేశ్వర్ తెలి.. సేఫ్ గానే ఉన్నానని, ఇంకా విమానాశ్రయంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దులియాజన్, టింగ్‌ఖాంగ్, టిన్సూకియాల్లో మూడు మీటింగ్స్ లో పాల్గొనాల్సి ఉన్న రామేశ్వర్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల తన మీటింగ్స్ కు హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని గువహటి ఎయిర్ పోర్ట్ వర్గాలు కూడా కన్ఫార్మ్ చేశాయి. అయితే.. మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు విమానంలో ఇంకా 150 మంది ప్రయాణికులు ఉన్నారు.