కాటేసిన పాము.. చనిపోయాడని అంత్యక్రియలు చేస్తుంటే షాక్

Update: 2023-07-02 09:05 GMT

ఒక్కోసారి ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. కళ్ల ముందు జరిగేది నమ్మకుండా మనం చూస్తుంది నిజమా.. కాదా అని షాక్ అవుతుంటాం. తాజాగా కర్నాటకలో అటువంటి ఘటనే జరిగింది.

ఓ వ్యక్తిని పాము కాటేసింది. దీంతో అతడు మరణించాడనుకుని కుటుంబసభ్యులు అంత్యక్రియలకు సిద్ధమైతే అతడు లేచి కూర్చున్నాడు.


 



గదగ జిల్లా హీరేకొప్ప గ్రామానికి చెందిన సిద్ధప్ప ఇటీవల మద్యం మత్తులో ఓ పామును పట్టుకున్నాడు. తన చేతిలో గరుడ రేఖ ఉందని, పాము తనను కాటేయదని చెబుతూ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ క్రమంలో అది ఏకంగా నాలుగు సార్లు కాటేసింది. ఇదేమీ పట్టించుకోని సిద్ధప్ప కొంచెం ముందుకు వెళ్ళగానే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ఈ క్రమంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బంధువులకు సూచించారు. అయితే అంత్యక్రియల వేళ అతడు లేచి కూర్చోవడంతో అంతా షాకయ్యారు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిద్ధప్ప కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది.


Tags:    

Similar News