ML Khattar Goes Incognito : మారువేషంలో జాతరకెళ్లిన ముఖ్యమంత్రి..

Byline :  Mic Tv Desk
Update: 2023-11-09 04:10 GMT

హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పంచకులలోని జాతరలో మారువేషంలో కనిపించడం వైరల్‌గా మారింది. రాష్ట్రంలో స్థానికంగా నిర్వహించే జాతరకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనను ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి కండువాతో కప్పుకొని మరీ మంగళవారం సాయంత్రం దర్శమనిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, తలకు టోపీ పెట్టుకుని ప్రజల మధ్య సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్​ తిరిగారు. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

పంచ్​కులాలోని సెక్టార్​-5లోని ఓ గ్రౌండ్​లో జరుగుతున్న మేళాకు మంగళవారం సాయంత్రం సీఎం ఖట్టర్ మారువేషంలో సామాన్య వ్యక్తిలా వచ్చారు. ఈ మేళాకు లక్షలమంది వస్తారు. ఈ మేళాలోనే.. ముఖ్యమంత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కాసేపు ప్రజల మధ్య తిరిగారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని, తలకు టోపీ ధరించి, తువ్వాలు చుట్టుకుని ఆ మేళాలో అటూ ఇటూ తిరిగారు. ఆ ప్రదేశంలో కొంచెం సేపు ఫోన్​ చూసుకుంటూ నిలబడ్డారు. అనంతరం సీఎం ఖట్టర్.. ఓ స్టాల్​లో పాప్​కార్న్ కొనుగోలు చేసి ఆ ప్రాంతమంతా తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.




Tags:    

Similar News