బిల్డింగ్పై సెల్ టవర్.. కుప్పకూలడంతో 11 మంది..

By :  Krishna
Update: 2023-12-09 10:19 GMT

జనావాస ప్రాంతాల్లో సెల్ టవర్లు పెట్టొద్దు అంటారు. కానీ పట్టణాల్లో మాత్రం భవనాలపైనే వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అయితే రేడియేషన్తో పాటు భవనంపై అధిక బరువుతో అందులోని జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. తాజాగా ఓ బిల్డింగ్‌పై ఉన్న మొబైల్ టవర్ ఏర్పాటు చేయగా.. బిల్డింగ్‌తో పాటు టవర్ కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన బెంగళూరులో జరిగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

బెంగళూరు నగర శివారులోని పార్వతి నగర్‌లో ఓ బిల్డింగ్పై సెల్ టవర్ ఏర్పాటు చేశారు. సెల్ టవర్ ఉన్న బిల్డింగ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో జేసీబీతో కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో సెల్ టవర్ ఉన్న భవనం కూలిపోయింది. భవనం పక్కన ఖాళీ స్థలంలో పడిపోగా.. సమీపంలో ఉన్న దుకాణాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. టవర్ పడిపోయింది. అయితే అప్పటికే ఆ బిల్డింగ్‌లో ఉన్న 11 మందిని స్థానికులు ఖాళీ చేయించడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సెల్ టవర్ బిల్డింగ్ కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియె వైరల్గా మారింది.

Tags:    

Similar News