ఫ్యాషన్‌ షో ఈవెంట్‌లో ఘోర ప్రమాదం.. మోడల్‌ మృతి

ఫ్యాషన్‌ షో ఈవెంట్‌లో ఘోర ప్రమాదం.. మోడల్‌ మృతి;

Update: 2023-06-12 06:48 GMT



ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఫిలింసిటీలో ఫ్యాషన్ షో ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ లైట్లను అమర్చిన ఇనుప స్తంభం (లైటింగ్‌ ట్రస్‌) మీదపడి.. ఓ మోడల్‌ (Model) అక్కడికక్కడే మృతిచెందింది. నోయిడా ఫిల్మ్ సిటీలో(Noida Film City area) ఆదివారం ఫ్యాషన్ షో సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఫ్యాషన్‌ షో కోసం ర్యాంప్‌వాక్‌ పక్కన అమర్చిన లైట్ల స్తంభం ఒక్కసారిగా ర్యాంప్‌పై పడిపోయింది. అదే సమయంలో 24 ఏళ్ల వంశికా చోప్రా (Vanshika Chopra) అక్కడ నడుస్తుండగా ఆ స్తంభం ఆమె మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వంశికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో ఈవెంట్‌లో పనిచేస్తున్న బాబీ రాజ్‌ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫ్యాషన్‌ షోకు అనుమతి లేకపోయినా నిర్వాహకులు ఈవెంట్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.



Tags:    

Similar News