Modi : ఎవరేం చేసినా.. మాదే హ్యాట్రిక్ విజయం: ప్రధాని మోదీ

Byline :  Bharath
Update: 2024-02-05 13:05 GMT

ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతమంది కలిసొచ్చినా బీజేపీదే హ్యాట్రిక్ విజయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడో టర్మ్ లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. 2014లో అధికారం చేపట్టిన సమయంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్తను ఇప్పుడు ఐదో స్థానాకినికి తీసుకొచ్చింది బీజేపీ పార్టీ అని గుర్తుచేశారు. ఈ పదేళ్లలో పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించినట్లు, 17 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు మోదీ గుర్తుచేశారు. ఇవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లు పట్టింది. కానీ ఇవన్నీ బీజేపీ పదేళ్లలోనే చేసి చూపించింది. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే.. మరో వందేళ్లపాటు ప్రజలు పేదరికంలోనే ఉంటారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంతో దేశానికి చాలా నష్టం జరిగిందని ఆయన అన్నారు.

ఎర్రకోట సాక్షిగా నెహ్రూ భారతీయులను అవమానించారు. అమెరికా, చైనా, రష్యా, జపాన్ పౌరులతో పోల్చితే.. భారతీయుల్లో నైపుణ్యం తక్కువ అని అవమానించారని మోదీ ఆరోపించారు. గత 70 ఏళ్లుగా గాంధీ కుటుంబం దేశ ప్రజలను చిన్న చూపు చూసింది. ఇప్పుడు కూడా వారి తీరు మారలేదని మోదీ మండిపడ్డారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ తయారుచేసింది. కొన్నాళ్లు హంగామా చేసింది. ఇప్పుడా కూటమి ఇప్పుడు కుప్పకూలిందని మోదీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలపై ఒక్కరికి కూడా నమ్మకం లేదని, అలాంటి వారికి దేశ ప్రజలు ఎలా నమ్ముతారని మోదీ ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. చంద్రయాన్ విజయంతో చరిత్ర సృష్టించాం. దేశంలో అన్ని ప్రాంతలను సమానంగా అభివృద్ధి చేసి చూపించామని మోదీ చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ మొహబత్ కీ దుకాన్ పై మోదీ సెటైర్లు వేశారు. మీ దుకాణం ఒక్క నాయకుడి కోసం మాత్రమే అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొడక్ట్ ను మాటి మాటికీ లాంచ్ చేస్తుందని మోదీ ఆరోపించారు. దేశాన్ని విభజించడమే వారి ధ్యేయంగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. విపక్షాల ఈ దుస్తితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, వారు చాలాకాలం విపక్షంలోనే ఉండాలని సంకల్పించుకున్నందుకు ధన్యవాదాలని మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తుంది. అది దేశానికి అస్సలు మంచిది కాదు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు. కానీ వారే పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు. అన్ని నిర్ణయాలు వారే తీసుకుని కుటుంబ పాలన చేస్తున్నరి సోనియా, రాహుల్ గాంధీలను ఆరోపించారు. ఈ పదేళ్లలో భారత్ సాధించిన విజయాలను కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూపిస్తుందని మోదీ అన్నారు. పార్లమెంట్ లో బీజేపీ ఏ బిల్లు అమలు చేసినా.. దాన్నికి కాంగ్రెస్ పార్టీ అడ్డు పడుతుందని మోదీ ఫైర్ అయ్యారు. ఖర్గే లోక్ సభ నుంచి రాజ్యసభకు మారారు. గులాంనబీ ఆజాద్ పార్టీ నుంచి షిఫ్ట్ అయిపోయారు. మిగతా నేతలు కూడా అదే తీరును కొనసాగిస్తారని అన్నారు. కాగా మోదీ ప్రసంగంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో లోక్ సభ రసవత్తరంగా మారింది.




Tags:    

Similar News