మొఘల్ చక్రవర్తి అక్బర్పై మోడీ సర్కారు ప్రశంసలు..

By :  Kiran
Update: 2023-09-12 16:50 GMT

జీ 20 సదస్సు సందర్భంగా మోడీ సర్కారు ప్రచురించిన మ్యాగజైన్లోని కొన్ని అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. భారత్.. ది మదర్ ఆఫ్ డెమొక్రసీ పేరుతో ముద్రించిన 24 పేజీలున్న ఆ పుస్తకంలో కేంద్రం మొఘల్ చక్రవర్తి అక్బర్పై ప్రశంసలు కురిపించింది. అక్బర్ గొప్ప ప్రజాస్వామిక నాయకుడు అని పొగిడింది. శాంతి, ప్రజాస్వామ్యానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది.

అక్బర్ ప్రజాస్వామిక ఆలోచనలు అసాధారణమైనవే కాక ముందు చూపు కలిగినవని మ్యాగజైన్లో ప్రస్తావించారు. మంచి పాలకుడు మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ఆలోచిస్తారని, మొఘల్ వంశానికి చెందిన 3వ చక్రవర్తి అక్బర్ అదే పాటించాడని చెప్పింది. విశ్వశాంతి సిద్ధాంతాన్ని పాటించిన అక్బర్ మతపరమైన వివక్షకు అడ్డుకట్ట వేశారని జీ 20 సమ్మిట్ మ్యాగజైన్లో రాశారు.




Tags:    

Similar News