భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా పీఎం షేక్ హసీనా.. బుధవారం (నవంబర్ 1) వర్చువల్గా ప్రాజెక్టులను ప్రారంభించారు. ఖుల్నా–మోంగ్లా పోర్ట్ రైల్వే లేన్, త్రిపురలోని అగర్తల–బంగ్లాదేశ్ బార్డర్లోని అఖౌరా క్రాస్ బార్డర్ రైల్వే లింక్, ఆ దేశంలోని రాంపాల్లో మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్రెండో యూనిట్లను ఈ సందర్భంగా ప్రారంభించారు. కాగా బంగ్లా కడుతున్న ఈ మూడు ప్రాజెక్టులకు భారత్ సాయం చేస్తుంది. క్రాస్ బార్డర్ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గంగా సాగర్ రైల్వే స్టేషన్ నుంచి నిశ్చింతపూర్ స్టేషన్ వరకు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇదో చారిత్రక ఘట్టం అని అన్నారు. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ ల మధ్య చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం అని అన్నారు. బంగ్లా అభివృద్ధికి సాయం అందించడం గర్వకారణం అని చెప్పుకొచ్చారు.