Underwater MetroTunnel : రైల్వే చరిత్రలోనే అద్భుతం..అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను ప్రారంభించిన మోదీ
ఇండియాలో మెట్ట మొదటిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది. కోల్‌కత్తాలో నిర్మించిన తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఎస్‌ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు.
#WestBengal: PM @narendramodi interacts with school students as he travels with them in India's first underwater metro train in #Kolkata. @metrorailwaykol @RailMinIndia pic.twitter.com/75rA3fVb0x
— DD News (@DDNewslive) March 6, 2024
అంతేగాక మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చిటించారు. మెట్రో ప్రయాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు కోల్‌కత్తాలోనే మొదలైంది. తాజాగా అండర్ వాటర్ టన్నెల్ లో మెట్రో పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ టన్నెల్ ను కోల్‌కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. టన్నెల్ లోపల నుంచి వెళ్లే ఈ మెట్రోరైలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.