MODI : తిరుచిరాపల్లిలో శ్రీ రంగనాథస్వామిని దర్శించుకున్న మోదీ
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో తిరుచిపల్లి శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణ ధోతి, అంగవస్త్రంతో ఆలయానికి వచ్చిన ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తులను ప్రధాని దర్శించుకున్నారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలో ఉన్న గజరాజు ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా శ్రీరంగం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తారు. కాగా, జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. చెన్నై వచ్చిన ప్రధానికి తమిళులు ఘనంగా స్వాగతం పలికారు. చెన్నైలో ప్రధాని రోడ్ షో గా ముందుకు సాగగా.. రోడ్డుకు ఇరుపక్కలా బారులు తీరిన జనం ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. వారందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు.