Mirzapur: కారు డ్రైవర్‌తో పీఎం గురించి డిబేట్.. చంపేసి వెళ్లిపోయాడు

Update: 2023-06-13 03:35 GMT

ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌ను పొగిడినందుకు ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయాడు. యూపీలోని మీర్జాపూర్‌లో ఈ ఘటన జరిగింది. మిర్జాపూర్‌లోని కొలాహి గ్రామానికి చెందిన రాజేశ్‌ధార్‌ దూబే (50).. తన సోదరుడి కుమారుడి వివాహానికి మిర్జాపుర్‌ వెళ్లాడు. వివాహం అనంతరం.. ధీరేంద్ర పాండేతో సహా అతని స్నేహితులతో కలిసి ఓ కారులో ఇంటికి బయల్దేరాడు.

ఇక కారులో రాజేశ్‌ధార్‌ పీఎం మోడీ సహ యూపీ సీఎం యోగిపై ప్రశంసలు కురిపించినట్లు.. కారులో ఉన్నవారు రాజకీయ చర్చకు తెరలేపారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. యోగి నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంలో హైక్వాలిటీ రోడ్లను నిర్మించిందని, యూపీలో నేరాలను అరికట్టారని , హౌసింగ్, టాయిలెట్లు మరియు వంట గ్యాస్ ఇలా అన్ని చోట్లా అభివృద్ధి కనిపిస్తుందని ప్రధాని మోడీని కూడా ప్రశంసించారట. అప్పటి వరకూ.. సైలెంట్ గా ఉన్న డ్రైవర్ అమ్జద్ ఆగ్రహానికి గురై యోగి-మోడీని దుర్భాషలాడడం ప్రారంభించాడని , దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని తెలిసింది. అమ్జద్ మొదట ధీరేంద్ర పాండేని మహోఖర్ దగ్గర, తర్వాత రాజేష్‌ధర్‌ని కొలాహిలో దింపినట్లు సమాచారం.

రాజేష్ తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళుతుండగా, అమ్జద్ రాజేశ్‌ధార్‌పై నుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో దూబే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య కేసు నమోదు చేయాలని కోరారు. మృతుడి బంధువులు మిర్జాపుర్‌-ప్రయాగ్‌రాజ్‌ రహదారిని దిగ్బంధించారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై రాజేష్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నగర ఎస్పీ శ్రీకాంత్ ప్రజాపతి వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Tags:    

Similar News