Mohammad Rafi : జైలు ఖైదీ.. పట్టుదలతో పట్టా సాధించాడు

By :  Bharath
Update: 2024-01-01 05:09 GMT

జీవిత ఖైదు శిక్షపడ్డ వారు చాలామంది జీవితంపై ఆశ కోల్పోయి.. మానసికంగా కుంగిపోతుంటారు. తమ ఆశయాలను వదులుకుని జైలుల్లోని బతికేస్తుంటారు. కానీ మహ్మద్ రఫీ అలా కాదు. పరిస్థితులను ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్న మహ్మద్ రఫీ.. తను అనుకున్నది సాధించాడు. బాగా చదువుకుని గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్న తన కలను జైలు నుంచి నెరవేర్చుకున్నాడు. ఓ వ్యక్తి దృఢ సంకల్పానికి, చదువుపై మమకారానికి అద్దం పడుతుంది రఫీ జీవితం. రఫీ స్వస్థలం నంద్యాల జిల్లా సోముల గ్రామం. రఫీ బీటెక్ చదువుతున్న రోజుల్లో (2014) ఓ అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్నాడు. ప్రేమ వ్యవహారంలో ఆ అమ్మాయిని హత్య చేసినట్లు కోర్టు నిర్దారించి.. రఫీకి 2019లో జీవిత ఖైదు విధించింది.

దాంతో అతన్ని పోలీసులు కడప సెంట్రల్ జైలు తరలించారు. అయితే చదువుకోవాలనే తన ఆశయాన్ని.. రఫీ జైలు అధికారులకు వివరించారు. అక్కడి అధికారుల ప్రోత్సాహంతో మళ్లీ పుస్తకాలు పట్టిన రఫీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టేన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంఏ సోషియాలజీలో చేరాడు. కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. 2022లో జరిగిన పీజీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాకుండా స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రఫీకి కోర్ట్ నాలుగు రోజుల బెయిల్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లడిన రఫీ.. చదువుపై ఉన్న మమకారంతో గోల్డ్ మెడల్ సాధించానని చెప్పాడు. తన గోల్డ్ మెడల్ ను తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు.




Tags:    

Similar News