మంకీ ఫీవర్‌ కలకలం..ఆ రాష్ట్రంలో 31 మందికి సోకిన వైరస్

Update: 2024-02-04 13:27 GMT

కర్నాటక రాష్ట్రం (Karnataka State) లో మంకీ పీవర్ కల్లోలం సృష్టిస్తుంది. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 31 మందికి వైరస్ సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరారు. మిగతా వారంతా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఇంత వరకు ఎలాంటి తీవ్రమైన కేసులు నమోదు కాలేదని హెల్త్ అధికారులు చెప్పారు. మంకీ ఫీవర్‌ తొలి కేసు జనవరి 16న నమోదైంది. మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) పేరుతోనూ పిలుస్తుంటారు. అయితే లక్షణాలను గుర్తించడం ద్వారా సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. మంకీ ఫీవర్‌ (Monkey fever) నుంచి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచించారు. కేఎఫ్‌డీకి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇవి ఇన్ఫెక్షన్‌ను నిరోధించడంలో సహాయపడతాయని డాక్టరులు తెలిపారు. ఇది జంతవుల నుంచి మనుషులకు సోకుతుంది. కోతుల్లో కనిపించే పేలు మనుషులను కాటు వేయడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది.

మంకీ ఫీవర్‌ దేశంలోని కర్నాటక, మహారాష్ట్ (Maharashtra) గోవాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్‌ కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేడీఎఫ్‌తో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంకీ ఫీవర్‌తో ఒక్కసారిగా ఆకస్మికంగా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న సమయంలో వాంతులు, విరేచనాలు తదితర సమస్యలుంటాయని తెలిపారు. మంకీ ఫీవర్‌ తీవ్రమైన సందర్భాల్లో ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. కొందరు వ్యక్తుల్లో వణుకు, అసాధారణంగా నడక, మానసిక గందరగోళం, కొత్తగా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. మంకీ ఫీవర్‌ బారినపడిన సమయంలో లక్షణాలు ముందుగానే గుర్తించి సరైన చికిత్స సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఈ కేఎఫ్‌డీకి నిర్ధిష్టంగా చికిత్స ఏమీ లేదు.

Tags:    

Similar News