వణికిపోతున్న హిమాచల్ ప్రదేశ్..భారీగా ప్రాణ నష్టం

Update: 2023-08-14 07:08 GMT

హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయి. సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు. ఆలయంలో శ్రావణమాసం పూజలు చేస్తుండగా ఒక్కసారిగా మందిర కూలిపోయింది.

సోలన్ జిల్లా జాడోన్ గ్రామంలో ముంచుకొచ్చిన వరదలకు రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడం విషాదాన్ని నింపింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వరదలో చిక్కుకున్న మరో ఐదుగురిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఇదే గ్రామంలో రెండు ఇళ్లతో పాటు ఓ గోశాల వరద నీటిలో కొట్టుకుపోయింది. రహదారులపై కొండచరియలు, చెట్లు విరిగిపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 257 మంది ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.




16 Killed, Many Feared Trapped As Monsoon Fury Returns To Himachal

Tags:    

Similar News