మణిపుర్లో మళ్లీ అదే ఘోరం.. అదే రోజు మరో ఇద్దరి అమ్మాయిలపై..

Update: 2023-07-22 06:15 GMT

మణిపూర్లో పైశాచిక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న మహిళలపై జరిగిన అమానుష ఘటనకు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ ఘటన సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లవెత్తుతున్న తరుణంలో అదే రోజు జరిగిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది.

కాంగ్‌పోక్పీ ప్రాంతంలో ఇద్దరు యువతులు కార్ల సర్వీస్‌ స్టోర్లో పనిచేస్తున్నారు. వారు షాపులో ఉండగా.. కొందరు వ్యక్తులు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారి ఫ్రెండ్ ఒకరు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని పోలీసులు అంబులెన్స్‌లో తరలించడం తాను దూరం నుంచి చూసినట్లు ఆమె వివరించారు.

ఇంతకుముందు ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ మంటలు చల్లారక ముందే మరో ఘోరం వెలుగులోకి రావడం కలకలం రేగుతోంది. మరోవైపు ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపి అతడి తలను నరికి ఇంటి ముందు ఉన్న కంచెకు వేలాడిదీశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో అందరినీ షాక్కు గురిచేసింది. బిష్ణుపుర్‌ జిల్లాలోని ఓ నివాసిత ప్రాంతంలో ఈ నెల 2న ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.

కుకీలు, మెయిటీల జాతుల మధ్య ఘర్షణతో గత కొన్ని నెలలుగా మణిపూర్ అట్టుడికిపోతోంది. మణిపూర్‌లోని మెయిటీలకు ఎస్టీ హోదాను.. నాగా, కుకీ సామాజిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే ఘర్షణల మాటున కొన్ని పైశాచిక ఘటనలు జరగడం అందరినీ కలిచి వేస్తున్నాయి.



Tags:    

Similar News