Heavy Traffic City : ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం ఏదో తెలుసా ?

Update: 2024-02-05 01:46 GMT

ప్రపంచంలో అత్యంత చెత్త ట్రాపిక్ ఉండే నగరాల జాబితాను టామ్‌టామ్ ట్రాఫిక్ నివేదిక (TomTom Traffic Report )విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. ప్రముఖ నగరాలు, పట్టణాలను ఈ సమస్యను కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తోంది. పట్టణాలను ఈ సమస్య ఏళ్లుగా పట్టి పీడిస్తోంది. వలసలతో ఓ వైపు నగరాలు కిక్కిరిస్తుంటే మరోవైపు మౌలిక సదుపాయాలు (Infrastructure) కల్పించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతోంది. మౌలిక సదుపాయాల్లో ప్రధానమైనవి రోడ్లు. భారత్‌లో చాలా నగరాలు సరైన ప్రణాళిక లేకుండా నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య (Traffic problem) విపరితంగా పెరిగింది. తాజగా యూకే రాజధాని లండన్ (London) ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే నగరంగా నివేదిక తెలిపింది. ఇక్కడ రద్దీ సమయంలో వాహనాలు గంటకు అత్యల్పంగా 14 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయని పేర్కొన్నాది.

2023లో ప్రపంచంలో ట్రాఫిక్‌తో అత్యధికంగా ప్రభావితమైన పది నగరాల్లో బెంగళూరు (6), పుణె(7)లు ఉన్నాయి. బెంగళూరు(Bangalore)లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాల సమయం పడుతుందని, పూణేలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 27.50 నిమిషాల సమయం పడుతుందని వివరించింది. బెంగళూరులో వాహనాల సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు కాగా, పూణేలో వాహనాల సగటు వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఇక ఈ జాబితాలో ఢిల్లీ (Delhi) 44, ముంబయి 54వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 55 దేశాల్లోని 387 నగరాల్లో ఇన్ కార్ నేవిగేషన్ వ్యవస్థలు, స్మార్ట్ ఫోన్ ఆధారిత సమాచారాన్ని విశ్లేషించి టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రూపొందించారు. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాలలో 387 నగరాల్లో సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, కార్బన్‌డైఆక్సైడ్ (Carbon dioxide) ఉద్గారాల ద్వారా వివరాలు సేకరించింది. 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

Tags:    

Similar News