యానిమల్ సినిమాపై పార్లమెంట్లో రచ్చరచ్చ

Byline :  Bharath
Update: 2023-12-08 12:31 GMT

యానిమల్ సినిమాపై పార్లమెంట్లో రచ్చ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ ఎంపీ రంజిత్ రంజన్ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా యానిమల్ సినిమాపై మాట్లాడిన ఆమె.. సినిమాలో హింసా, మహిళలపై వేధింపులు వంటి అంశాలు తప్పా ఇంకేంలేవని.. యానిమల్ సినిమా ఒక బ్యాడ్ సినిమాకు ఉదాహరణగా చూపిస్తూ రచ్చ చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ రంజిత్ రంజన్ కుమార్తె ఇటీవల యానిమల్ సినిమా చూసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. విషయం ఏంటని ఎంపీ ఆరాతీయగా.. ఆ సినిమాలో వైయొలెన్స్ కంటెంట్ ఎక్కువ ఉందని కంప్లైంట్ ఇచ్చింది. దానిపై సీరియస్ అయిన ఎంపీ రంజిత్ రంజన్ పార్లమెంట్ సాక్షిగా మండిపడ్డారు.

ఎంపీ రంజిత్ రంజన్ మాట్లాడుతూ.. ‘సినిమా అనేది సొసైటీకి అద్దం లాంటిది. మనం సినిమాలు చూసి పెరుగుతాం. ముఖ్యంగా యూత్ మీద సినిమాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొన్నటి కబీర్ సింగ్, పుష్ప సినిమాలు.. ఇప్పుడు యానిమల్ సినిమా. ఇలాంటి సినిమాలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. కబీర్ సింగ్ సినిమాలో హీరో అమ్మాయిలని సరిగ్గా ట్రీట్ చేయడు. దీన్ని యూత్ రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఈ సినిమాల్లో పురుష అహంకారం, సమాజంపై విషపూరితమైన ఆలోచనలు చూపిస్తున్నారు. ఈ సినిమాల్లో వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంది. యానిమల్ సినిమాలో పవిత్రమైన సిక్కుల సాంగ్ ఒక మర్డర్స్ చేసే యాక్షన్ సీన్ లో వాడారు. సిక్కుల మనోభావాలు కూడా దెబ్బతీశార’ని విమర్శలు గుప్పించారు.

ఈ విషయంలో రంజిత్ రంజన్ పై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. సెన్సర్ బోర్డ్ యానిమల్ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లలోపు పిల్లలు ఈ సినిమా చూడటానికి వీల్లేదు. అయితే ఎంపీ కూతురు ప్రస్తుతం ఇంటర్ చదువుతుంది. అంటే తనకు 16 లేదా 17 ఏళ్లు ఉండొచ్చు. అయితే ఆమెకు టికెట్ ఎవరు కొనిచ్చారు. ఆన్ లైన్ లో కొన్నా, థియేటర్ వద్ద తీసుకున్నా.. యాజమాన్య ఆమెను ఆపకుండా ఎందుకు ఊరుకుంది. ఎంపీకి నిజంగా కోపం ఉంటే.. థియేటర్ యాజమాన్యాన్ని విమర్శించాలి. తెలిసినా సినిమాకు వెళ్లిన తన కూతరును అనాలి. మధ్యలో సినిమా మేకర్స్ ను అనడమేంటి. నిబంధనల ప్రకారమే వాళ్లు సినిమా తీస్తారు. కండీషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేస్తారని నెటిజన్స్ మండిపడుతున్నారు. కాగా ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News