చాట్‌జీపీటీ ఇండియాకు చేతకాదా? అంబానీ సంచలన ప్రకటన

Byline :  Lenin
Update: 2023-08-29 06:53 GMT

చాట్ జీపీటీ తరహా ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను తయారు చేసుకోవడం భారతీయులకు చేతకాదన్న చులకన వ్యాఖ్యలను రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ సవాలుగా తీసుకున్నారు. భారతీయుల కోసం అలాంటి ఏఐను జియో తీసుకొస్తుందని ప్రకటించారు. ముంబైలో జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ గురించి వెల్లడించారు.

‘’జియో చాట్‌జీపీటీ తరహా టెక్నాలజీని తయారుచేస్తుంది. అందరికీ అన్ని చోట్లా ఏఐని అందుబాటులోకి వస్తుంది. ఆ విజయం సాధించాక టెక్నాలజీ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి’’ అని అన్నారు. భారతీయులు చాట్‌‌జీపీటీ తరహా ఏఐని తయారు చేసుకోరని చాట్ జీపీటీ ఓపెన్ఐ సీఈవో, కంప్యూటర్ ప్రోగ్రామర్ సామ్ ఆల్ట్‌మాన్ రెండు నెలల కిందట అన్నారు. భారతీయులు అలాంటి కృత్రిమ మేధను తయారుచేసుకోవడానికి ప్రయత్నంచగలరే తప్ప విజయం సాధించలేరని అన్నారు. ఏఐ మాడ్యూల్స్ చాలా క్లిష్టమైనవని గూగుల్ ఇండియా మాజీ సీఈవీ రాజన్ ఆనందన్‌తో ఇష్టాగోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News