వీడు ఇంకో రకం.. ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో ఉడికించాడు

Update: 2023-06-08 06:08 GMT

దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్‌(Shraddha Walkar)హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇంకా దానిని మర్చిపోకముందే అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మరోకేసు వెలుగుచూసింది. తనతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను దారుణంగా హత్యచేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆ మహిళ డెడ్ బాడీని చెట్లు కోసే మిషన్‌తో ముక్కలుముక్కలుగా కట్ చేశాడు. వాటిని రోజూ కుక్కర్‌లో ఉడకబెడుతున్నాడు. అయితే ఓ రోజు వారి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు.

వివరాలిలా.. మనోజ్‌ సహానీ(56) అనే వ్యక్తి.. సరస్వతి వైద్య(36) అనే మహిళతో ముంబైలోని (Mumbai) గీతానగర్‌లో (Geeta Nagar) ఉన్న ఓ అపార్ట్‌మెంటులో మూడేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే నిన్న వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది.

నాలుగు రోజుల క్రితం సరస్వతితో గొడవపడి మనోజ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగల కారణాలు తెలుసుకుంటున్నామని డీసీపీ జయంత్‌ బజ్‌బాలే (DCP Jayant Bajbale) చెప్పారు. మనోజ్‌తోపాటు మరో ఇద్దరు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నామని వెల్లడించారు. రోజుకో పార్ట్ చొప్పున ఆమె శరీర భాగాలను నిందితుడు కుక్కర్‌లో ఉడికించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News