Bala Ram : బాలరాముని దర్శించేందుకు సుమారు 150 కి.మీ ప్రయాణించిన ముస్లింలు

Update: 2024-02-01 04:16 GMT

500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల కల సాకారం అయ్యింది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట, మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద మంత్రాల నడుమ, శ్రీరామ నామ పరాయణంతో కన్నుల పండవగా సాగింది. దేశంలోని ప్రతి ఒక్కరూ కుల, మత విబేధాలు లేకుండా రమణీయమైన బాలరాముడిని చూసి పునీతులయ్యారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టన అనంతరం దేశంలోని నలుమూలల నుంచి భక్తుల స్వామివారిని దర్శించుకోవాడానికి బారులు తీరారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రామ్ లల్లాను ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో మతసామరస్యం వెల్లివిరిసింది. కులం, మతం అనే తేడా లేకుండా జగదభీరాముని దర్శనం చేసుకుంటున్నారు ప్రజలు. లక్నోకు చెందిన దాదాపు 350 మంది ముస్లింలు రాముల వారి దర్శనానికి విచ్చేసారు. సుమారు ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 25 కి.మీ చొప్పన కాలి నడకన సుమారు 150 కి.మీ ప్రయాణించి శ్రీరాముని సన్నిధికి చేరుకున్నారు. ఆనందకరుడిని దర్శించుకొని పులకించిపోయారు. రాముడు అందరికీ పూర్వికుడని...రామ్, రహీమ్ ఒక్కడేనని వారంతా మత సామరస్యాన్ని చాటారు.



Tags:    

Similar News