జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

Update: 2023-06-18 05:48 GMT

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈసారి 1.80లక్షల మంది ఎగ్జామ్ రాయగా 43,773 మంది అర్హత సాధించారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్కు చెందిన విద్యార్థి వావిలాల చిద్విలాస్‌ రెడ్డి జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా నిలిచాడు. చిద్విలాస్‌ రెడ్డి మొత్తం 360 మార్కులకు 341 మార్కులు సాధించాడు. హైదరాబాద్‌ జోన్‌కే చెందిన మరో తెలంగాణ విద్యార్థి నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకు దక్కించుకుంది. అధికారులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// jeeadv.ac.inలో అందుబాటులో ఉంచారు.

రేపట్నుంచి జోసా కౌన్సిలింగ్

ఈ నెల 4న రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు దాదాపు 1.80 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది ఎగ్జామ్ రాశారు. పరీక్షా ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్‌ కీని కూడా అందుబాటులో ఉంచారు. సోమవారం నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. కటాఫ్‌ మార్కులు ఆధారంగా విద్యార్థులకు ‘జోసా’ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు. క్వాలిపై అయిన విద్యార్థులు ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల ఆధారంగా ఐఐటీతో పాటు 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ చేస్తారు.

టాప్ టెన్ ర్యాంకర్ల లిస్టు

1. వావిలాల చిద్విలాస్‌ రెడ్డి

2. రమేశ్‌ సూర్య తేజ

3. రిషి కర్లా

4. రాఘవ్‌ గోయల్‌

5. అడ్డగడ వెంకట శివరామ్‌

6. ప్రభవ్‌ ఖండేల్వాల్‌

7. బిక్కిన అభినవ్ చౌదరి

8. మలయ్‌ కేడియా

9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి

10. యక్కంటి ఫణి వెంకట మణింధర్‌ రెడ్డి

జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

జూన్‌ 19 రిజిస్ట్రేషన్‌, చాయిస్‌ ఫిల్లింగ్‌

జూన్‌ 25 మాక్‌ సీట్స్ అలాట్ మెంట్ -1

జూన్‌ 27 మాక్‌ సీట్స్ అలాట్ మెంట్ -2, ఆప్షన్స్ ఫ్రీజింగ్

జూన్‌ 28 రిజిస్ట్రేషన్‌ ముగింపు

జూన్‌ 29 సీట్ల కేటాయింపు కోసం డేటా వెరిఫికేషన్‌

జూన్‌ 30 మొదటి విడత సీట్ల కేటాయింపు

జూలై 06 రెండో విడత సీట్ల కేటాయింపు

జూలై 12 మూడో విడత సీట్ల కేటాయింపు

జూలై 16 నాలుగో విడత సీట్ల కేటాయింపు

జూలై 21 ఐదో విడత సీట్ల కేటాయింపు

జూలై 26 ఆరో విడత సీట్ల కేటాయింపు

Similar News