Prime minister of Bharat: దేశం పేరు మారింది.. ఇదిగో ప్రూఫ్!

Byline :  Bharath
Update: 2023-09-09 08:33 GMT

గత కొన్ని రోజులుగా దేశం పేరును ఇండియా బదులు భారత్ గా మార్చాలనే చర్చలు నడుస్తున్నాయి. ఈ కేంద్ర నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. ఇప్పటికే పలు అధికారిక లెటర్స్ లో ఇండియా బదులు ప్రస్తావిస్తుండగా.. మరో సారి ఈ పేరు వార్తల్లోకి వచ్చింది. జీ20 సమ్మిట్ లో భాగంగా కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాగా, సమావేశంలో ప్రధాని ముందు ఉన్న డిస్ ప్లే కార్డ్ పై భారత్ అని రాసి ఉంది. అంతేకాకుండా భారత్ నుంచి రిప్రెజెంటేటివ్ గా భారత్ పేరునే ప్రస్తావించారు. ప్రెసిడెంట్ ముర్మూని భారత ప్రెసిడెంట్ అని సూచిస్తూ జీ20 విందుకు ఆహ్వానించారు.



Tags:    

Similar News