కేసీఆర్ ప్లాన్లు ఇక్కడ పనిచేయవ్..సక్సెస్ అవ్వరు : పవార్

Update: 2023-06-20 06:41 GMT

సీఎం కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన ఆయన.. పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై ఆయన ప్రధాన దృష్టి సారించారు. ఇప్పటికే అక్కడి వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరగా.. ఇటీవలె నాగ్పూర్లో పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలిటిక్స్పై ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు.

మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన సక్సెస్ కాలేరని అజిత్ పవార్ అన్నారు. మాయావతి, ములాయం సింగ్ వంటి సీనియర్‌ నేతలు ఇప్పటికే మహారాష్ట్రలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించి.. విఫలమయ్యారని గుర్తు చేశారు. ‘‘వారిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో వారి పార్టీలను విస్తరించాలని ప్లాన్స్‌ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో పార్టీలను, ప్రజలను ప్రభావితం చేయడంలో సక్సెస్‌ కాలేదు. కేసీఆర్‌ జాతీయ స్థాయి నాయకుడు కావాలని ఎంతో ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు’’ అని అన్నారు.

దేశం, రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ హోర్డింగులు, యాడ్స్‌పై విపరీతంగా ఖర్చు చేస్తోందని పవార్ విమర్శించారు. ఆ డబ్బంతా కేసీఆర్కు ఎక్కడ నుంచి వస్తోందనే విషయంపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. కాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని అక్కడ కూడా అమలుచేస్తామన్నారు.

Tags:    

Similar News