రైతులతో ముగిసిన చర్చలు...మద్దతు ధరపై కేంద్రం ప్రతిపాదన

By :  Vinitha
Update: 2024-02-19 02:36 GMT

రైతుల డిమాండ్ల పరిష్కారానికై కొన్ని రోజులుగా ఢిల్లీ చలో(chali delhi) పేరుతో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం రైతులతో నాలుగవసారి చర్చలు జరిపాయి. రైతు సంఘాల నాయకులతో కేంద్రమంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయెల్‌, నిత్యానంద్ రాయ్‌ చర్చలు జరిపారు. ఈ చర్చలు నిన్న అర్థరాత్రి వరకు కొనసాగాయి. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని తెలిపారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్‌(NCCF), ఎన్‌ఏఎఫ్‌ఈడీ(NAFED) వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయన్నారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని..దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్రం ప్రతిపాదనలతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వంతో చర్చలు అనంతరం రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంథేర్ మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదనలను తమ రైతు సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. నిపుణుల అభిప్రాయాలు కూడా సేకరించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లకు ఇంకా క్లారిటీ రాలేదని..దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని ఆపేశామని...ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కరించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని శర్వాన్ సింగ్ చెప్పారు.

Tags:    

Similar News