New Year 2024 Vastu : ఇంట్లో కొత్త క్యాలెండర్ ఈ దిశలో ఉంటే అశుభమే

Byline :  saichand
Update: 2024-01-13 02:50 GMT

కొత్త ఏడాది ప్రారంభమై అప్పుడే పక్షం రోజులకు దగ్గరగా వచ్చింది. ఈ ఏడాదిలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు, వేసుకున్న ప్రణాళికలను నెరవేర్చుకునే విధంగా వడివడిగా అడుగులు పడుతూ ఉంటాయి. అలాగే నూతన సంవత్సరంలో ఇంట్లో కొన్ని మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇళ్లలోని పాత క్యాలెండర్ స్థానంలో కొత్త క్యాలెండర్ వచ్చేస్తుంది. అయితే చాలా మంది క్యాలెండర్ ను ఇంట్లో ఏ మూలనా పడితే ఆ మూలన పెట్టిస్తూ ఉంటారు. కాని వాస్తు శాస్త్రంలో క్యాలెండర్ కు ప్రత్యేక స్థానం ఉంది.

ఇంట్లో నూతన సంవత్సర క్యాలెండర్ను పెట్టే ముందు, పాత క్యాలెండర్ను తొలగించండి. దీని తర్వాత మాత్రమే కొత్త క్యాలెండర్ను గోడపై ఉంచండి. వాస్తు ప్రకారం, ఇంట్లో పాత క్యాలెండర్ ఉంచడం మీ పురోగతిపై ప్రభావితం పడుతుంది.

వాస్తు ప్రకారం, నూతన సంవత్సర క్యాలెండర్ను ఇంటి వాయువ్య లేదా తూర్పు గోడపై మాత్రమే ఉంచండి. పొరపాటున కూడా దక్షిణ దిశలో పంచాంగాన్ని పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల ఇంటి పెద్దల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

ఇంటిలో చిత్రాలతో కూడిన క్యాలెండర్ను పెట్టి ఉంటే, క్యాలెండర్లోని చిత్రం సానుకూల సందేశాన్ని ఇవ్వాలని గుర్తుంచుకోండి. హింసాత్మక జంతువులు, విచారకరమైన ముఖాలు లేదా ప్రతికూల చిత్రాలు ఉన్న క్యాలెండర్లను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు.

వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ పై పొరపాటున కూడా క్యాలెండర్ పెట్టకండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పురోగతి కనిపించదు.

నూతన సంవత్సర క్యాలెండర్ను తలుపు వెనుక ఉంచవద్దు. అలా చేయడం చాలా అశుభం. అందువల్ల, క్యాలెండర్ ను సరైన దిశలో మాత్రమే ఉంచడం మంచిది.

Tags:    

Similar News