ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించే పనిలో ఎన్ఐఏ నిమగ్నమైంది. దీంతో పాటు ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ కమాండోలు పేలుడు జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన దర్యాప్తు సంస్థలు ఇద్దరు ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ అంబాసిడర్ ను దూషిస్తూ ఓ లెటర్ ను గుర్తించారు. ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్కు చెందిన ఇతర కార్యాలయాల వద్ద భద్రత పెంచారు.
ఎంబసీకి సమీపంలో జరిగిన పేలుడుపై ఇజ్రాయెల్ స్పందించింది. దీన్ని ఉగ్రదాడిగా అనుమానించింది. పేలుడు నేపథ్యంలో భారత్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. వారిని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని సలహా ఇచ్చింది. దీంతో పాటు ఇజ్రాయెల్ గుర్తులను ప్రదర్శించకుండా ఉండాలని కోరింది.
భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో గతంలోనూ రెండుసార్లు దాడులు జరిగాయి. 2012లో ఎంబసీలోని ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది భార్య కారుపై బాంబు దాడి జరగగా ఆ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. 2021లో ఎంబసీ వెలుపల పేలుడు జరగగా కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి.
#WATCH | Forensic teams and Dog squad of NSG carry out an investigation near the Israel Embassy.
— ANI (@ANI) December 27, 2023
As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/X4lMPD2FR8