గుర్పత్వంత్ సింగ్కు NIA షాక్.. ఆస్తులు సీజ్

By :  Kiran
Update: 2023-09-23 10:28 GMT

కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంజాబ్‌లోని అతని ఇల్లు, భూమిని జాతీయ దర్యాప్తు సంస్థ..NIA స్వాధీనం చేసుకుంది. చండీగఢ్‌లోని సెక్టార్‌ 15లో ఉన్న గురుపత్వంత్ సింగ్‌ ఇంటితో పాటు అమృత్‌సర్ లోని ఆస్తులన్నింటినీ సీజ్ చేసింది. అమృత్‌సర్‌కి చెందిన గురుపత్వంత్‌పై రివార్డు కూడా ప్రకటించింది.

గురుపత్వంత్‌పై ఇంట్లో దాదాపు 30 నిమిషాలకుపైగా సోదాలు నిర్వహించిన NIA అనంతరం ఆస్తుల్ని జప్తు చేసింది. ఇంటి ముందు ఓ నోటీస్ బోర్డ్ పెట్టింది. అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్‌ గ్రామంలో గురుపత్వంత్‌ సింగ్‌కి చెందిన వ్యవసాయ భూమిని సైతం జప్తు చేసినట్లు NIA ప్రకటించింది.

కెనడాలో నివాసం ఉంటున్న గురుపత్వంత్ అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషం వ్యాప్తి చేస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకూ అతనిపై 22 క్రిమినల్ కేసులు బుక్ అయ్యాయి. వాటిలో 3 రాజద్రోహం కేసులు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం చాలా రోజులుగా గురుపత్వంత్ నేర చరిత్ర గురించి కెనడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూనే ఉంది. కానీ ట్రూడో ప్రభుత్వం ఇప్పటి వరకూ అతనిపై ఎలాంటి చర్యలం తీసుకోలేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన భారత్‌ ఖలిస్థాన్ సానుభూతిపరులపై చర్యలకు ఉపక్రమించింది.

Tags:    

Similar News