కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ బిల్లు తక్షణమే అమల్లోకి: నిర్మలా సీతారామన్
ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల బిల్లును బడ్జెట్ లో ప్రతిపాదించి.. తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధిచి కొత్త బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఊహాజనిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ బిల్లు 2023ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు ప్రకారం.. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఆదాయ, కార్పొరేట్ ట్యాక్స్ లు ఏప్రిల్ 1 నుంచి లేదా నోటిఫై చేసిన తేదీల్లో అమలవుతాయి. కాగా ఎక్సైజ్, కస్టమ్స్ ట్యాక్స్ మార్పులు తక్షణమే అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ది ప్రావిజనల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్, 1931 స్థానంలో ఈ కొత్త చట్టం రానుంది. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల విధింపు, పెంపు తక్షణ అమలుకు ఈ బిల్లు వీలు కల్పింస్తుంది.