Budget-2024 : నిర్మలమ్మ బడ్జెట్‌లో ఆ ప్రకటనలు..ప్రజల ఆశలు తీర్చేనా?

Update: 2024-02-01 05:13 GMT

(Budget-2024) కాసేపట్లో ఆరోసారి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఆశించొద్దని ఇదివరకే ప్రజలకు నిర్మలమ్మ చెప్పారు. మరోవైపు ఈసారి బడ్జెట్‌లో ఊరటలు ఉంటాయని జనం నమ్ముతున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్‌ ముందుకు రానుంది. ఉదయం 11 గంటలకు నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్‌లో ఈసారి ట్యాక్స్ పేయర్ల కోసం కోత పన్ను విధానాన్ని ఎంచుకునేలా పలు మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే ఇన్‌కంటాక్స్ మినహాయింపు పరిమితి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో పలు రకాల మినహాయింపులకు వీలు కల్పించొచ్చని పలువురు భావిస్తున్నారు. ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే యోచన చేసే అవకాశం ఉంది.

అలాగే విదేశీ ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్స్ సవరణలను మరింత సులభతరం చేసే అవకాశం ఉందని, ఈవీ వాహనాల లోన్స్‌పై వడ్డీలో రాయితీలను పెంచే ప్రకటన రానుందని ఆశిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా ప్రతులను రాజ్యసభలో సభ్యలకు ఇవ్వనున్నారు. బడ్జెట్‌ను సమర్పించేందుకు ముందుగా పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీ తర్వాత నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.   

 


 


 


 


Tags:    

Similar News