Nita Ambani : కుమారుడి పెళ్లిపై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు

Byline :  Vamshi
Update: 2024-03-01 07:40 GMT

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశీల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో గుజరాత్‌లోని జామ్ నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. సినీ సెలబ్రటీలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు జామ్ నగర్‌కు తరలి వస్తున్నారు. వీరిని స్వాగతం పలికేందుకు తోరణాలు ఏర్పాటు చేశారు. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్ నగర్ చేరుకున్నారు. బిల్ గేట్స్ కూడా రానున్నారు. ఈ నేపధ్యంలో నీతా అంబానీ ఓ కీలక సందేశాన్ని ఇచ్చారు. నా చిన్న కుమారుడు విషయంలో రెండు కోరికలు ఉన్నాయి. మన మూలను గుర్తించుకునేలా పెళ్లి వేడుకలను నిర్వహించాలని భావించాం. మన సంస్కృతి, దేశ వారసత్వ కళలను ప్రతిబింబించేలా ఉండాలని ఆమె అన్నారు. మరోవైపు ఈ వేడుక‌ల్లో అతిథుల‌కు పసందైన వంటకాలు వడ్డించనున్నారు.

ఏకంగా 2,500 వంట‌కాల‌ను వ‌డ్డించ‌నున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఒక‌సారి వ‌డ్డించిన వంట‌కాన్ని మ‌రోసారి వ‌డ్డించ‌కుండా విందు ఇవ్వనున్నట్లు స‌మాచారం. దీని కోసం ప్రత్యేక మెనూ సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. 2,500 వంట‌కాల త‌యారీ కోసం మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 21 మంది చెఫ్‌ల‌ను పిలిపించిన‌ట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అతిథుల‌కు భార‌తీయ వంట‌కాల‌తో పాటు జ‌ప‌నీస్, మెక్సిక‌న్, థాయ్, పార్సీ ఇలా ప‌లు సంప్రదాయ వంట‌ల‌ను రుచి చూపించున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్‌లో 75 వెరైటీలు, లంచ్‌లో 225, డిన్నర్‌లో 275 ర‌కాల వంట‌ల‌ను వ‌డ్డించ‌నున్నారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంట‌ల వ‌ర‌కు 85 వంట‌కాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు టాక్. జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్‌ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్‌ అతిథులకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫైవ్‌స్టార్‌ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్‌లు స్టే చేసేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్‌లను ఏర్పాటు చేసింది. గెస్ట్‌లు కోసం ఏర్పాటు చేసిన ఈ విలాసవంతమైన టెంట్లలో టైల్డ్‌ బాత్రూమ్స్‌ సహా సకల సదుపాయాలూ ఉంటాయి.

Tags:    

Similar News