Nitin Gadkari : ఖర్గేకు కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసులు

Byline :  Vamshi
Update: 2024-03-02 02:21 GMT

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జాతీయ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లీగల్ నోటీసు పంపారు. తన ఇంటర్వూను వక్రీకరించి ఎక్స్‌లో పోస్టు చేసినందుకు 3 రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, కూలీలు, సంతోషంగా లేరు. గ్రామాల్లో రోడ్లు, నీరు. ఆస్పత్రులు లేవని గడ్కరీ అన్నట్లు ఐఎన్‌సీ వీడియో పోస్టు చేసింది. అయితే ఆయా రంగాలపై ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పిన మాటలను వక్రీకరించారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలు, పేదలు, కూలీలు, రైతుల ప్రగతికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. తెలంగాణలో తమ మంత్రిత్వ శాఖ రెండు లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తోందన్నారు.

రాజకీయ నేతల ప్రసంగాల్లో ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ అని ప్రస్తావించేవారని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లు వేసిందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగాలు, రైతుల సంక్షేమం, మహిళలకు హక్కులు కల్పించేందుకు బీజేపీకి మద్దతు ఇవ్వాలని గడ్కరీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశంలోని జనాభాలో 65 శాతం మంది మాత్రమే గ్రామాల్లో నివసిస్తున్నారని కేంద్ర మంత్రి గడ్కరీ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉండేవని.. తాగునీరు లేదని, రైతులు పండించిన పంటకు సరైన ధర లభించలేదన్నారు. ఇక, మహారాష్ట్రలో మంత్రిగా ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మరియు ఇతర ప్రాజెక్టులను నిర్మించడంలో తన పాత్రను గడ్కరీ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేపట్టిన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన చేసిన మేలు గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఆయన మాటలను వక్రీకరించి పోస్టు చేసిందని గడ్కరీ లీగల్ తాఖీదులు పంపారు.

ఏఐసీసీ CHIEF




Tags:    

Similar News