INDIA కూటమి నుంచి ఒక్కక్కరు ఔట్.. సోనియా గాంధీ ఫోన్ చేసినా పట్టించుకోని నితీశ్ కుమార్

Byline :  Bharath
Update: 2024-01-27 07:08 GMT

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి. ముఖ్యంగా బలంగా మారుతోంది అనుకున్న ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగుతుంది. కాంగ్రెస్ కుటమీకి రోజుకో పార్టీ దూరమవుతుంది. తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్.. కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని దీదీ ప్రకటించగా.. నితీశ్ కుమార్ మరోసారి బీజేపీతో పొత్తుపెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే కేంద్రంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బే. ఈ కారణాల వల్ల రాహుల్ గాంధీ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి ఢిల్లీ వెళ్లారు. కూటమి నేతల్లో సమస్వయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఊహాగానాల వేళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నితీశ్ కుమార్ కు ఫోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సోనియాతో మాట్లాడేందుకు నితీశ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 30నాటికి బిహార్ లోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ అధిష్టానం నితీశ్ ను ఆహ్వానించింది. ఈ మేరకు శుక్రవారం సోనియా గాంధీ.. నితీశ్ కుమర్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ కాల్స్ ను నితీశ్ కుమార్ పట్టించుకోలేదని తెలుస్తుంది. రాహుల్ యాత్రలో పాల్గొనకూడదనే కారణంతో నితీశ్ ఇలా చేస్తున్నారని సదరు వర్గాలు చెప్తున్నారు. దీంతో ఇండియా కూటమి కూలిపోయిందనే ఊహాగాలకు మరింత బలం చేకూరింది.

నితీశ్ కుమార్ ఇండియా కూటమి ఏర్పడటంతో ముఖ్య పాత్ర పోషించారు. అయితే, ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కూటమి సారథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎంచుకున్నారు. దీనిపై నితీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కూటమి నేతలు.. నితీశ్ కుమార్ ను కన్వీనర్ పదవి చేపట్టాలని ఒప్పించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. అంతేకుండా ఎన్నికలు సమీపిస్తున్నా.. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో కూటమి నుంచి నితీశ్ కుమార్ తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన బీజేపీ ముఖ్యనేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. 

Tags:    

Similar News