Parliament Elections : మార్చి మూడవ వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌..!!?

Update: 2024-02-18 05:57 GMT

పార్లమెంట్‌ ఎన్నికలపై కీలక అప్డేట్‌ వచ్చింది. మార్చిలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 15న రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఏప్రిల్ మూడో వారంలో తెలంగాణ లోక్ సభకు సంబందించిన ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

ఇక ఈ ఎన్నికల సంఘం మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్‌ అయింది. అందుకే తెలంగాణలో...బీజేపీ నాయకత్వం కనీసం 10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా నోటిఫికేషన్ విడుదలకు ముందే తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. చేవెళ్ల, భువనగిరి, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి ఇద్దరి పేర్లను రాష్ట్ర నాయకత్వం ఆమోదం కోసం పార్టీ హై కమాండ్ కు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజిగిరి, జహీరాబాద్ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రేసులో ఉన్నారని, అందుకే ఈ రెండు స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెబుతున్నారు బీజేపీ నేతలు.

ఇక కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారని తెలుస్తోంది. కాగా రెండు దశాబ్దాలుగా పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 




Tags:    

Similar News