ఒడిశా రైలు ప్రమాదం.. 233 మంది మృతి, 1000 మందికి గాయాలు

తంబ్.. రాష్ట్రమంతా కన్నీటి సుడిగుండం;

Update: 2023-06-03 01:37 GMT

ఒడిశా కన్నీటి సంద్రమైంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో అపార ప్రాణనష్టం సంభవించింది. 233 మంది చనిపోగా వెయ్యిమందికిపైగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతులకు నివాళిగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. మృతుల్లో అత్యధికం పశ్చిమ బెంగాల్ వాసులే ఉన్నారు.

బాలేశ్వర్ జిల్లాలోని బాలేశ్వర్ సమీపంలో బజార్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌడాకు వెళ్తున్న బెంగళూరు-హౌడా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏడున్నర గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. చాలా బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడిపోయాయి. అదే సమయంలో చెన్నై వెళ్తున్న షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ అటుగా దూసుకొచ్చి వాటిని ఢీకొట్టింది. కోరమాండల్‌ రైలుకు చెందిన 15 బోగీలు పక్కపట్టాలపై బోల్తాపడ్డాయి. వాటినిపై ఓ గూడ్సు రైలు ఢీకొంది. రెండు ప్రయాణికుల రైళ్లు, ఒక గూడ్సు రైలు చెల్లచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. ఆర్తనాదాలతో దద్దరిల్లింది.

ప్రమాదంపై కొన్ని పొంతనలేని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. విషయం తెలియగానే రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతానికి 233 మృతదేహాలను వెలికి తీశామని, లోపల మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తామని, క్షతగాత్రులకు రూ. 50 రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం నవీన్ పట్నాయక్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News