రైళ్ల రాకపోకలు ప్రారంభం..రైల్వే మంత్రి ప్రార్థనలు..వీడియో వైరల్

Update: 2023-06-05 10:29 GMT

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద స్థలి వద్ద రెస్క్యూ పూర్తైంది. వందల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సుమారు పు 51 గంటల్లో ధ్వంసమైన ట్రాక్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీంతో మళ్ళీ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆదివారంరాత్రి త్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలు పట్టాలెక్కింది. ఈ సమయంలో అక్కడే ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ కోసం ప్రార్థించారు. ట్రైన్ పటాలెక్కి వెళ్తున్న సమయంలో చేతులు జోడించి నమస్కరించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. వేగంగా రైల్వే లైనును పునరుద్ధరించిన సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ప్యాసింజర్ ట్రైన్ల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపించి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ట్రైన్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.

శుక్రవారం రాత్రి ప్రమాదం అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పరిస్థితిని సమీక్షించి అధికారులను అప్రమత్తం చేశారు. సహాయచర్యల్ని అనుక్షణం దగ్గరుండీ పర్యవేక్షించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ట్రాక్ మరమ్మత్తులు, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు అన్నీ తానై వ్యవహరించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పనితీరుపై ప్రశంసలు వస్తున్నాయి.


Tags:    

Similar News