ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల ఫోటోలు SER వెబ్‌సైట్లో

Update: 2023-06-03 14:41 GMT

ఒడిశా రైలు ప్రమాద స్థలిలో రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో 1200 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. నుజ్జునుజ్జైన రైలు బోగిలను క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. అక్కడక్కడ ఇంకా మృతదేహాలు బయటపడుతున్నాయి.

మొత్తం ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది చనిపోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయిన వారి ఆచూకీ లెలియక బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉండడంతో గుర్తించడం కష్టంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో మృతుల ఫోటోలను సౌత్ ఈస్టర్న్ రైల్వే(SER) అధికార వెబ్ సైట్లో ఉంచింది. బాధితులను గుర్తుపట్టేందుకు వారి ఫోటోలను అప్‌లోడ్ చేసింది. https://ser.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్లో కూడా కొందరి ప్రయాణికుల ఫోటోలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. దుస్తుల ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

రైలు ప్రమాద ఘటన బాధితుల బంధువులు, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ ఓ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ప్రమాదస్థలికి రైలు నడుస్తోంది. సా.6:30కి చెన్నై సెంట్రల్‌లో ప్రారంభమైన ఈ రైలు భువనేశ్వర్ వరకు వెళ్తోంది.

Tags:    

Similar News