ఒడిశా రైలు దుర్ఘటనపై సుప్రీం కోర్టులో పిల్

Update: 2023-06-04 08:13 GMT

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని నిపుణుల బృందం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ ఘటనలో రిస్క్ అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించాలని సూచించింది. అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‎లో కోరింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణులను మెంబర్లుగా ఏర్పాటు చేసేలా సర్కార్‎కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆ నివేదికను సుప్రీంకు అందించేలా చూడాలన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags:    

Similar News