సిగ్నల్ ఇచ్చి ఆపేశారు.. మానవ తప్పిదం వల్లే ప్రమాదం!

Update: 2023-06-03 11:50 GMT

ఒడిశా రైలు ప్రమాదఘటనపై ప్రాథమిక దర్యాప్తు రిపోర్టు వెల్లడైంది. సిగ్నలింగ్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. మొదట కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ కు మెయిన్ లైన్కు సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత దానిన ఆపేయడంతో ఈ రైలు రాంగ్ ట్రాక్లోకి వెళ్లినట్లు నిపుణులు గుర్తించారు. సిగ్నలింగ్ లోపంతో మెయిన్ లైన్లోకి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్‌ లైన్‌లోకి వెళ్లి గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టినట్లు నివేదికలో ఉంది.

‘‘చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్‌కి బదులుగా లూప్‌ లైన్‌లోకి వెళ్లింది. ఈ రైలు మెయిన్‌లైన్‌లోనే చెన్నై వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు బహనగా స్టేషన్‌ దాటిన కొద్దిసేపటికే సిగ్నలింగ్లో పొరపాటు వల్ల ఈ రైలు పొరపాటున లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది. మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండొచ్చు’’ అని ఓ రైల్వే అధికారి చెప్పారు.

ప్రమాద సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 130 కి.మీల వేగంతో వెళ్తోంది. దీంతో లూప్‌లైన్‌ ఉన్న గూడ్స్‌ రైలును గుర్తించినా వేగాన్ని నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో 280పైగా మృతిచెందగా.. 1000మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News