Ram Lalla old idol : తవ్వకాల్లో బయటపడ్డ.. అయోధ్య రామున్ని పోలిన విగ్రహం

Byline :  Bharath
Update: 2024-02-07 10:54 GMT

కర్నాటక, రాయచూర్ జిల్లాలోని దేవసుగూర్ గ్రామంలో పురాతన విగ్రహం బయల్పడింది. కృష్ణా నదిపై వంతెన నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుగుతుండగా.. శతాబ్దాల నాటి హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. ఇందులో ఒక శివలింగం, విష్ణుమూర్తి విగ్రహాలు ఉండగా.. విష్ణువు విగ్రహం అచ్చం అయోధ్యలోని బాలక్ రామ్ ను పోలి ఉండటం గమనార్హం. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. తవ్వకాలు జరుపుతున్న సిబ్బంది నదిలోని విగ్రహాలను సురక్షితంగా వెలికితీసి.. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు.

ఈ విష్ణువు విగ్రహం చుట్టూ.. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, బుద్ధ, కల్కి తదితర దశావతారాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని శిథిలమయ్యాయి. ఈ విగ్రహం అనేక విలక్షణమైన లక్షణాలను కలిగి ఉందని రాయచూర్ యూనివర్సిటీ పురావస్తు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ తెలిపారు. విగ్రహం ఉన్న భంగిమ ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగునంగా చెక్కారని ఆమె అన్నారు. విగ్రహానికి నాలుగు చేతులు ఉండగా.. శంఖు చక్రగధలతో ఉంది. కాగా అచ్చం అయోధ్య రామ విగ్రహాన్ని పోలి ఉండటంతో.. స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై పూర్తి విచారణ జరిపి, త్వరలో విగ్రహాలకు సంబంధించిన సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News