భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా వివిధ భాగాల్లో మొత్తం 2,500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఇస్తారు. పూర్తి వివరాలకు https://ongcindia.com/లో చూడొచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే అభ్యర్థి ముందుగా నోటిఫికేషన్ బ్రోచర్ (https://ongcindia.com/web/eng/career/recruitment-notice)ను డౌన్‌లోడ్ చేసుకుని.. ఈ జాబ్ గురించి అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ తర్వాత అప్లై చేయడం ఈజీ అవుతుంది.
నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివే..
ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో 2500 ఖాళీలు
విద్యార్హత: 10 వ తరగతి, 12 వ తరగతి, సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ట్రేడ్/ విభాగాలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, స్టోర్ కీపర్, మెషినిస్ట్, సర్వేయర్ తదితరాలు.
ఏజ్ లిమిట్ : సెప్టెంబర్ 20 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000. డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,000. ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,000 చొప్పున నెలకు ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ ఇలా..: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పని చేయాల్సిన కేంద్రాలు: రాజమండ్రి, కాకినాడ, చెన్నై, దేహ్రాదూన్, మెహసానా, జోర్హాట్, నజీరా అండ్ శివసాగర్, సిల్చార్, కరైకాల్, అగర్తల, కోల్‌కతా, ఢిల్లీ, జోధ్‌పుర్, గోవా, హజీరా, ముంబయి, ఉరాన్, అహ్మదాబాద్, అంకలేశ్వర్, బరోడా, బొకారో, కాంబే.