స్విగ్గీ, జొమాటో సహా అన్ని డెలివరీ సేవలు బంద్!

By :  Bharath
Update: 2023-09-05 14:45 GMT

ఆకలేసిన ప్రతీసారి ఫుడ్ డెలివరీ యాప్స్ వంక తొంగి చూసేవాళ్లకు బ్యాడ్ న్యూస్. స్విగ్గీ, జొమాటో సేలను నిలిపేస్తున్నట్లు ఢిల్లీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడేలా అని కంగారు పడకండి. ఈ ఆంక్షలు కేవలం మూడు రోజులే అమలు కానున్నాయి. జీ20 సమావేశాల కోసం రాజధాని ఢిల్లీ ముస్తాబవుతుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జీ20 సదస్సు జరుగనుంది. ఈ సమావేశాల్లో 20 దేశాల అధినేతలో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసింది.

సదస్సు సందర్భంగా 80వేల మంది ఢిల్లీ పోలీసులు, లక్షా 30 వేల మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. దీంతో నగరంలో పలు ఆంక్షలు అమలు కానున్నాయి. ఇందులో మూడు రోజుల పాటు (సెప్టెంబర్ 8, 9, 10) భాగంగానే క్లౌడ్ కిచెన్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి డెలివరీ సేవల అనుమతులు నిరాకరించింది. దాంతో పాటు సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశం నిలిచిపోనుంది. 8,9,10 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించడంతో పాటు.. 9, 10 తేదీల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.




Tags:    

Similar News