OYO బంపర్ ఆఫర్.. ఇప్పుడు ఉండండి, తర్వాత బిల్ కట్టండి

Update: 2023-06-16 12:03 GMT

ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో రూమ్స్.. తమ కస్టమర్లకు తాజాగా ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రూపాయి కట్టకుండా రూమ్ వాడుకునే వెసులు బాటు కల్పించింది. షాపింగ్ సైట్లలో ఉండే పే లేటర్ ఆప్షన్ ను ఇప్పుడు ఓయో రూమ్స్ కు కూడా తీసుకొచ్చింది. దీనివల్ల కస్టమర్లకు ఓయే మరింత చేరువవుతుంది ఆశిస్తున్నారు. దీనికోసం సింపుల్ పేతో టైఅప్ అయి.. ఓయో ఈ సేలను అందుబాటులోకి తెస్తుంది.

ప్రయాణాలు చేసేవాళ్లు.. ఓయో యాప్ ఎక్కువగా వినియోగించేవాళ్లకు ఈ సేవలు ఉపయోగపడతాయి. దాంతో ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. స్టే నౌ పే లేటర్ ఆఫర్ ద్వారా కస్టమర్లు గరిష్ఠంగా రూ.5వేల వరకు క్రెడిట్ పరిమితి పొందొచ్చు. ఈ అమౌంట్ ను 15 రోజుల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 15 రోజుల తర్వాత సింపుల్ పే క్రెడిట్ కార్డుతో చెల్లించాలి. అయితే ఇందులో ఓ మత్లబ్ ఉంది. పేమెంట్ చేయడం లేట్ అయితే.. మీరు ఇంట్రెస్ట్

కట్టాల్సి ఉంటుంది. లేదా పెనాల్టి అయినా పడుతుంది. ఆ పెనాల్టితో జీఎస్టీ టాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది.

Tags:    

Similar News