Parliament Budget : ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Update: 2024-01-31 01:50 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీఏ 2.0 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇవి లోక్‌సభ ఎన్నికల ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు కానున్నాయి. ఎన్నికల అనంతం ఏర్పాడనున్న కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి తొలిసారిగా మాట్లాడుతారు.

ప్రస్తుతానికి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. కాగా, రేపు(ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీరో అవర్, క్వశ్చన్‌ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్‌ ఇచ్చారు. అనంతరం ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది.

ఆ తర్వాత ఉభయసభల్లో ప్రధానీ దీనిపై జవాబు ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

కాగా, రేపు సమర్పించే మధ్యంతర బడ్జెట్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆరవది. భారత మాజీ ప్రధానీ మొరార్జీ దేశాయ్ తర్వాత..వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డులకు ఎక్కనుంది. మొరార్జీ దేశాయ్ కూడా ఐదు సమగ్ర బడ్జెట్‌లతో పాటు ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఐదుసార్లు పూర్తి బడ్జెట్‌ను ప్రకటించిన నిర్మలా సీతారామన్, రేపు మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

మధ్యంతర బడ్డెట్ లో ప్రజలను ఆకట్టుకునే పథకాలేమీ ఉండవు. ఇప్పటికేపెద్ద ప్రకటనలు ఉండవని ఆర్థిక మంత్రి సైతం ప్రకటించారు. అయినప్పటికీ, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌లోనూ ప్రజాకర్షక ప్రకటనలు ఉంటాయని సామాన్యులు భావిస్తున్నారు. ఇటు జనరల్ ఎలక్షన్స్ ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరోవైపు కేంద్రాన్ని గట్టిగా నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజా సమస్యలు, సామాన్యుల కష్టాలతో పాటు పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్దం అవుతున్నాయి.




Tags:    

Similar News