పార్లమెంటు కొత్త బిల్డింగులో సమావేశాలు ఎప్పటినుంచంటే..?

Byline :  Kiran
Update: 2023-09-06 09:45 GMT

ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్పెషల్ సెషన్ వెనుక ఎజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు కొత్త బిల్డింగ్లోకి మారనున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత బిల్డింగ్ లోనే స్పెషల్ సెషన్ ప్రారంభంకానుంది. అయితే సెప్టెంబర్ 19న వినాయతి చవితి రోజున కొత్త బిల్డింగ్లో సమావేశాలు జరపనున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ప్రత్యేక సమావేశాల్లో జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్లు ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చెప్పారు.

పార్లమెంటు స్పెషల్ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చే తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News