కామ్ గా ఉండండి, లేకపోతే మీ ఇంటికి ఈడీ అధికారులు వస్తారు-కేంద్రమంత్రి

Update: 2023-08-04 06:06 GMT

నిన్న పార్లమెంటులో కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. అధికారుల నియంత్రణ బిల్లు మీద లోక్ సభలో చర్చ జరుగుతుండగా... ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీని మీద స్పందిస్తూ మినాక్షీ లేఖి నిశ్శబ్దంగా ఉండడండి లేదంటే మీ ఇళ్ళకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించారు.




 


అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును నిన్న లోక్ సభ ఆమోదించింది. నిరసనలు, నినాదాల మధ్య చాలా సేపు చర్చలు జరిగిన తర్వాత ఈ బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది. అప్పుడే మీనాక్షీ లేఖి ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడారు. బిల్లును సమర్ధిస్తూ...కేజ్రీవాల్ పావు వంతు సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికే సగం అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన నపథ్యంలో ఆమె ఈ మాటలు అన్నారు.




 


మీనాక్షి లేఖి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని...ఇది ఇంతకు ముందు నుంచే మేము నెబుతున్నామని విపక్షాలు అంటున్నాయి. విపక్సాలను బెదిరించిన మీనాక్షీ మాటలే ఇందుకు సాక్ష్యమని ఎన్పీసీ ఆరోపించింది.


Tags:    

Similar News