PM Kisan money : పీఎం కిసాన్ డబ్బులు రూ.12 వేలకు పెంపు..కేంద్రం క్లారిటీ

Update: 2024-02-06 15:09 GMT

రైతులు వ్యవసాయం చేసేందుకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా నగదు ఇస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మూడు విడతల్లో రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు చొప్పున్న అందిస్తూ వస్తోంది. ఇలా ఏడాదికి రూ.6 వేలు అవుతోంది. ఇప్పటి వరకూ ఇదే జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం రూ.6 వేలను కాస్తా రూ.12 వేలకు పెంచబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది.

పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.12 వేలు నగదు ఇవ్వడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ఈ విషయంపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ నగదును పెంచే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా మహిళా రైతులకు అందించేటటువంటి సాయాన్ని కూడా పెంచడం లేదని తెలిపారు. దీంతో రైతులకు మరోసారి నిరాశే ఎదురైంది.

పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వారందరికీ 15 విడతల్లో ఇప్పటి వరకూ రూ.2.81 లక్షల కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమచేసినట్లుగా అర్జున్ ముండా వెల్లడించారు. అందులో కూడా ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు ప్రయోజం పొందుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు శుభవార్త చెబుతారని అందరూ అనుకున్నారు. కానీ కేంద్రం పీఎం కిసాన్ నగదు పెంచబోమని చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News