PM Modi : అబుదాబి చేరుకున్న మోదీ.. ఘనస్వాగతం పలికిన అధ్యక్షుడు

Byline :  Krishna
Update: 2024-02-13 12:12 GMT

ప్రధాని మోదీ యూఏఈ వెళ్లారు. రెండు రోజుల పాటు యూఏఈ, ఖతార్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. అబుదాబిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. 2015 నుంచి ఇప్పటివరకు మోదీకి ఇది ఏడో యూఏఈ పర్యటన. ప్రెసిడెంట్ మహ్మద్ బిన్తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు.

అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని 27 ఎకరాలలో సుందరంగా నిర్మించారు. ఆ తర్వాత ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా దుబాయ్లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు. యూఏఈ, ఖతార్ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అంతకుముందు మోదీ అన్నారు. అదేవిధంగా తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించబోతుండడం సంతోషంగా ఉందన్నారు.

Tags:    

Similar News