అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియడంతో ప్రధాని మోదీ తాను చేపట్టిన కఠిన ఉపవాస దీక్షను విరమించారు. పండితులు గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ ఆయనకు తీర్ధం అందించి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్ష నేపథ్యంలో జనవరి 12 తేదీనుంచి నెలపైనే ప్రధాని నిద్రించారు. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారు. దీక్ష సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ధ్యానం, యోగా, సాత్వి ఆహారం, కఠిన తపస్సు చేపట్టారు. ఐదు శతబ్దాల కల సాకారం.. ఎక్కడైతే రాముడు జన్మించారో అక్కడే దివ్య భవ్య రామాలయం.. 5వందల ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భం.. అభిజత్ లగ్నంలో అయోధ్య గుర్భగుడిలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోదీ 32 ఏళ్ల మహాయజ్ఞం దిగ్విజయంగా పరిపూర్ణమైన మహోతన్న సందర్భం ఇది.. రాజకీయాల్లోకి రాకముందు నుంచే రామ భక్తుడిగా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సంకల్పం చేపట్టారు నరేంద్ర మోదీ.
అద్వానీ రథయాత్రలో కీలక పాత్ర పోషించారు. 1992లోనే మోదీ ధృఢ సంకల్పం. సత్య నిష్టతో సత్య సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. ఈ వేడుక కోసం నిష్టగా 11 రోజుల దీక్ష చేపట్టారు ప్రధాని మోదీ. రాముడు నడియాడిన క్షేత్రాలను సందర్శించారు. తమిళనాడులో రామసేతును దర్శించారు..సముద్ర స్నానం చేశారు. రామేశ్వరంలో.. శ్రీరంగంలో..ధనుష్కోటి కోదండరామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 11 రోజుల దీక్షలో ప్రతినిత్య రామాయణాన్ని పఠించారు. నియమ నిష్టలో దీక్షను కొనసాగించిన ప్రధాని మోదీ.. మనసంతా భక్తితో రామవిహ్రా ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోదీ ఉపవాస దీక్షను విరమించారు.
#WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ
— ANI (@ANI) January 22, 2024