PM Modi : సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను దర్శించుకున్న మోదీ

By :  Krishna
Update: 2024-02-25 13:59 GMT

ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటించారు. ద్వారకలో అతిపొడవైన సుదర్శన్‌ సేతు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భంలో ఉన్న ద్వారాక వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకను పాలించినట్లు హిందవులు నమ్ముతారు. ఆ తర్వాత అది సముద్రంలో కలిసిపోయినట్లు చెబుతారు. కాగా సముద్రంలోకి వెళ్లడం మోదీకి ఇది రెండోసారి. ఇంతకుముందు లక్ష్యదీప్కు వెళ్లిన ఆయన అక్కడి సముద్రంలో స్నార్కెల్లింగ్ చేశారు.

సముద్ర గర్భంలోని ద్వారక వద్ద ప్రత్యేక పూజలు చేయడంపై మోదీ స్పందించారు. ‘‘ సముద్ర గర్భాన ఆధ్యాత్మిక, చారిత్రక సంగమం అయిన ద్వారకను దర్శించుకున్నాను. ఇక్కడ ప్రతిక్షణం శ్రీకృష్ణుని ఉనికిని ప్రతిధ్వనించే దివ్యమైన రాగాన్ని అనుభూతి చెందాను’’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక మోదీ ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జి ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో కలుపుతుంది. ద్వారకాదీశ్‌ ఆలయాన్ని చూడడానికి వచ్చే టూరిస్ట్ లకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు.

Tags:    

Similar News