PM Modi : ప్రధాని మోదీ చేతుల మీదుగా.. రామమందిర కార్మికులకు ఘన సన్మానం
అయోధ్య రాముడి తొలి దర్శనంతో భారతావని పులకరించింది. కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరింది. కాగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం.. అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ సన్మానించారు. వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీల్లో కూర్చోబెట్టి ప్రతీ కార్మికుడి వద్దకు స్వయంగా వెళ్లారు. ఓ బుట్టలో పూలు తీసుకుని వారిపై చల్లుతూ గౌరవించారు. అనంతరం వారందరికీ మోదీ నమస్కరించారు. ఈ అద్భుత కార్యంలో భాగమైనందుకు వారికి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మహత్తర ఘట్టాన్ని కోట్లాది మంది భారతీయులు టీవీల్లో వీక్షించారు. కొన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో ఏర్పాటుచేసిన స్క్రీన్ల ద్వారా తిలకించారు.
సోమవారం (జనవరి 22) మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజీత్ ముహూర్తంలో 84 సెకన్లకు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. వేదమంత్రోచ్చారణ మధ్య రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం, స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చాడు బాలరాముడు. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో ఉన్న ఆ చిన్ని రాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి అశేష భక్తకోటి తన్మయత్వం చెందింది.
ये वो हाथ हैं जो कभी रुके नहीं कभी थके नहीं...
— BJP (@BJP4India) January 22, 2024
प्राण-प्रतिष्ठा के बाद श्रीराम मंदिर निर्माण में अपना योगदान देने वाले श्रमिकों पर पीएम मोदी ने पुष्पवर्षा कर सम्मानित किया।#राम_का_भव्य_धाम pic.twitter.com/35RqKUutgy